Peddi Reddy – Full Song
Singer: Folk Artist
Lyrics: Traditional
Music: Folk
Category: Telugu Folk Song
Website: tfolksongs.com
About Peddi Reddy Folk Song
Peddi Reddy Full Song is a popular Telugu folk song that represents village life, family emotions, and the deep bond between father and child. This traditional folk song is widely sung during rural festivals, cultural programs, and village celebrations across Telangana and Andhra Pradesh.
The song gained popularity for its emotional lyrics and simple folk music style. Peddi Reddy folk song lyrics reflect love, sacrifice, and rural values, making it one of the most searched Telugu folk songs online.
Listen Full Song Below
Peddi Reddy Song Lyrics
Below are the full lyrics of Peddi Reddy Telugu folk song. You can read the lyrics in Telugu or English using the buttons.
పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలె నన్ను జేసీ పెంచెనే ఓ రామ సిలుకా
పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలె నన్ను జేసీ పెంచెనే ఓ రామ సిలుకా
కోరామీసాలు దువ్వుతూ మా నాయనా
కోరొక్క కూత పెడితెనే ఓ నాయనా
పెద్దా పులంత సప్పుడే మా నాయనా
తప్పే ఒప్పేసుకుంటరే..
ఊరంత పెద్దోడు నా ముందు పసోడు..
నేనూ పుట్టినప్పుడు మా నాయనా
నిండు అమాసనంటనే ఓ నాయనా
మా నాయన మొఖం అప్పుడు
పండు పున్నమంటనే ఓ నాయనా
మా నాయనా గుండె తొట్టెళ్ల సేసి
నన్ను ఊయల్లో ఊపెనంటనే
పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా
పట్టూ లంగాలు తెచ్చెనే ఓ నాయనా
మారాణి నేనైతె గుర్రామె తానై
నా బారాలు అన్ని మోసెనే..
ఏడు ఊళ్లు చెప్పుకునేలా నా పెళ్లి చేసినాడులే
కన్నీళ్లు దాచి గుండెల అక్షింతలేసినాడులే
నేనూ లేని ఇంటిలో మా నాయనా
కునుకే లేక కంటిలో
కడుపారగన్నోడు నా కడుపులో పుడితే
పెట్టుకుంటి ఆయన పేరునే
పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలె నన్ను జేసీ పెంచెనే ఓ రామ సిలుకా
About Peddi Reddy Folk Song
Peddi Reddy is a traditional Telugu folk song that shows the deep bond between father and child. It is one of the most emotional village folk songs.

